Acharya Set: ఆచార్య సెట్లో భారీ అగ్నిప్రమాదం!
Acharya Set Fire: హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద 2022లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం భారీ సెట్ ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అది అలాగే ఉండడంతో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు, ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘భోళా శంకర్ షూటింగ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ప్రధాన నటీనటులు అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్‌గా సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో అయన ప్రేక్షకుల ముందు రానున్న ‘భోళా శంకర్’ సినిమా విషయానికి వస్తే.. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సీనిమాని నిర్మిస్తోంది. చిరంజీవి సరసన డాజ్లింగ్ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా ‘మహానటి’ కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ పాత్రలో కనిపించనుంది.