Honour Killing: హైదరాబాద్ లో పరువు హత్య
Honour Killing: వేరే వర్గానికి చెందినయువకుడిని తమ కూతురు పెళ్లి చేసుకుందనే కారణంతో ఓ వ్యక్తిని అతికిరాతంగా చంపారు. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఈ పరువు హత్య జరిగింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ అనే డీజే ఆపరేటర్ కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి కుటుంబం తో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. అక్కడ ఉన్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు.
ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించారు. అప్పుడు నివాసం మార్చిన హరిశ్.. యువతితో ప్రేమను కొనసాగించాడు.పెద్దలకు తెలియకుండా ఈ జంట వివాహం చేసుకున్నారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే ఈ జంట అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. అనుమానం వచ్చిన యువతీ పేరెంట్స్ కు పెళ్లి వ్యవహారం తెలిసింది. హరీష్, ఆ యువతి కలిసి ఉండగా యువతి బంధువులు అటాక్ చేశారు. దూలపల్లిలో నడిరోడ్డుపైనే ఆమె ముందే హరీష్ పాశవికంగా హత్య చేశారు. కూతురు ఎదుటే ప్రేమించిన వ్యక్తిని హత్య చేశారు. భార్య బంధువులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.