Holi Festival Celebrations: దేశవ్యాప్తంగా మొదలైన హోలీ సంబరాలు
Holi Festival Celebrations: దేశవ్యాప్తంగా హోలీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయ. కొన్ని ప్రాంతాల్లో నేడు హోలీ ఉత్సవాలు నిర్వహించుకుంటుండగా, మరికొన్ని ప్రాంతాల్లో రేపు హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాముని దహనం పూర్తయింది. హిరణ్యకశివుని సోదరి హోళికా అనే రాక్షసి సంహారమే హోళికా దహనంగా చెబుతారు. హోళికా దహనం తరువాత వేడుకలను నిర్వహిస్తారు. దేశంలో దీపావళి తరువాత అత్యంత వైభవంగా జరుపుకే పండుగ ఇది. హోలీ రోజున గులాములు జల్లుకుంటూ సంబంరాలు చేసుకుంటారు.
అయితే, కెమికల్స్ కలిపిన రంగులు కాకుండా సహజసిద్దంగా లభించే రంగులతోనే సంబరాలు జరుపుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నగరవాసులు కూడా సహజరంగులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హోలీ సందర్బంగా నగరవాసులకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఈ సంబరాలను ఇళ్లవద్దనే జరుపుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్లపైనా రంగులు చల్లుకోకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా, ఈరోజు నుండి మార్చి 8వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. హోలీ వేడుకలను సవ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిర్వహించుకోవాలని ఆదేశించింది.