Holi: హోలీ కి ముస్తాబైన భాగ్యనగరం
Holi: భాగ్యనగరంలో హోలీ సంబరాలుఅంబరనాటబోతున్నాయి. నగరంలోని పలు పార్క్‌లో డీజే పాటలతో నగరవాసులు రంగులు చల్లుకుంటూ డాన్సులు చేయనున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా హౌలీ పండుగను నగరవాసులు బహిరంగంగా జరుపుకునే అవకాశం లేదు. గతేడాది రంగుల్లో మునిగి తేలిన యువత ఈసారి కూడా ఏడాది హౌలీ సంబరాలను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతుంది. భాగ్యనగరం లోఈసారి వెయ్యికి పైగా స్పెషల్ఈవెంట్లు ప్లాన్చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలైపోయాయి. టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ప్యాకేజీని బట్టి టికెట్ ధరలను నిర్ణయిస్తుంచారు. కొంతమంది ఆర్గనైజర్లు యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు సెలబ్రిటీలను, సోషల్ ఇన్‌ఫ్లూయన్సర్లను ఈవెంట్లకు తీసుకొస్తున్నారు.
రెయిన్డ్యాన్స్, ఆర్గానిక్ కలర్స్, ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంచనున్నారు. మాదాపూర్ బీస్పోర్టీలో హోలీ కే రంగ్ ఈవెంట్ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు రూ.199 నుంచి టికెట్ రేట్లను అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవనున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ బాగా అవుతున్నాయి. టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. యువత ఈసారి ఉత్సాహంగా పండుగను జరుపుకోబోతున్నారు.