Hyderabad: వినాయక నిమజ్జనాలపై హైకోర్టు కీలక నిర్ణయం
High court crucial orders on Vinayaka Nimajjan: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ ) విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసిన హైకోర్టు, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు పేర్కొంది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. పీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వలేదన్న హైకోర్టు, పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే దుర్గాపూజపై పశ్చిమ బంగ్లా ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని హైకోర్టు సూచనలు చేసింది.