Formula E: మంత్రి కేటీఆర్ ను అభినందించిన హీరో మహేశ్ బాబు
Formula E World Championship on February 11 in Hyderabad
ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలు హైదరాబాద్ లో ఫిబ్రవరి 11న జరగనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోటర్ స్పోర్ట్స్ హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా తెలంగాణ ఖ్యాతి మరింత పెరగనుందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలను విజయవంతం చేయాలని హీరో మహేశ్ బాబు నగర వాసులను కోరారు. ట్విట్టర్ లో వీడియోను పోస్టు చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ ను అభినందించారు. ఫార్ములా వన్ రేసు నిర్వహణలో భాగంగా నిలిచిన గ్రీన్‌కో సంస్థ సీఈవో అనిల్ చలమల శెట్టిని కూడా మహేశ్ బాబు అభినందించారు.
Let's race against climate change! Congratulations @KTRTRS garu, @TelanganaCMO, & Anil Chalamalasetty garu on bringing #FormulaE to Hyderabad! Looking forward to #GreenkoHyderabadEPrix on Feb 11th!@HMDA_Gov @AceNxtGen pic.twitter.com/Lwf1I9T8Cp
— Mahesh Babu (@urstrulyMahesh) January 24, 2023
#Hyderabad plays host to the #FormulaE World Championship on February 11th. Let’s cheer with @ktrtrs garu and Anil Chalamalasetty garu for the #GreenkoHyderabadEPrix as they flag off the green race in India for the first time ever. @AceNxtGen
— vennela kishore (@vennelakishore) January 24, 2023
ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్ చూసేందుకు అవసరమైన టిక్కెట్ల విక్రయం జనవరి 4వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మొదటి టిక్కెట్ బుక్ చేసుకున్నారు.
ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ ఫార్ములా ఈ రేస్ అధికార ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది. ఫార్ములా వన్ రేసును విజయవంతంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. గత కొన్ని నెలలుగా నిరంతరం శ్రమిస్తోంది. ఫార్ములా ఈ రేసులో మొత్తం 11 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 22 మంది డ్రైవర్లు అభిమానులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. రేసింగ్ చూసేందుకు కనీస టిక్కెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.
టిక్కెట్ల ధరలను నాలుగు క్యాటగిరీలుగా విభజించారు. గరిష్ట ధర 10వేల రూపాయలు కాగా, కనిష్ఠ ధర వెయ్యి రూపాయలుగా ఉంది. 6వేల రూపాయల విలువైన టిక్కెట్లు, 3500 రూపాయల టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రేసింగ్ టిక్కెట్లు బుక్ మై షో తో పాటు ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు చెందిన వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ ప్రమోట్ చేస్తున్న ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థను అనిల్ కుమార్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి స్థాపించారు. క్లీన్ ఎనర్జీ కంపెనీ అయిన గ్రీన్ కో సంస్థ వ్యవస్థాపకులు కూడా వీరే కావడం విశేషం.