Sankranthi: టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ..మామూలుగా లేదుగా
Heavy traffic at Bibi Nagar, Panthangi Toll gates
హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రావాళ్లు సంక్రాంతి సందర్భంగా తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో పంతంగి, బీబీనగర్ టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఏపీ వైపు వెళ్లిన వాహనాల సంఖ్యను పోలీసులు వెల్లడించారు.
పంతంగి టోల్ గేట్ (హైదరాబాద్ – విజయవాడ) చౌటుప్పల్ నుంచి జనవరి 12న ఎన్ని వాహనాలు వెళ్లాయనే వివరాలను పోలీసులు వెల్లడించారు. మొత్తంగా 56,595 వాహనాలు ఆ రోజు పంతంగి టోల్ గేట్ దాటి వెళ్లాయి. వాటిలో 42,844 కార్లు ఉండగా, 1300 ఆర్టీసీ బస్సులు, 4913 ప్రైవేట్ బస్సులు, 7538 ఇతర వాహనాలు పంతంగి టోల్ గేట్ మార్గం ద్వారా ఏపీకి బయలుదేరాయి.
జనవరి 13వ తేదీన పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల ప్రవేశం మరింతగా పెరింగింది. మొత్తం 67,577 వాహనాలు ఆ మార్గం గుండా వెళ్లాయి. అందులో కార్లు 53,561 ఉండగా, ఆర్టీసీ బస్సులు 1851 ఉన్నాయి. ప్రైవేటు బస్సులు 4906 ఉండగా, ఇతర వాహనాలు 7259 ఉన్నాయి.
బీబీనగర్ టోల్ గేట్ (హైదరాబాద్ – వరంగల్) గుండా వెళ్లిన వాహనాల సంఖ్యను గమనిస్తే జనవరి 13న మొత్తం 25,231 వాహనాలు ఆ మార్గం ద్వారా ప్రయాణం చేశాయి. అందులో 17,844 కార్లు ఉండగా, 872 బస్సులు ఉన్నాయి.
ట్రావెల్ సందర్భంగా ప్రయాణికులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అనేక సూచనలు చేశారు. రోడ్లపై నిలబడకుండా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ల వద్ద మాత్రమే బస్సుల కోసం వేచి ఉండాలని పోలీసులు కోరారు. అనధికార వాహనాల్లో ప్రయాణించవద్దని కూడా పోలీసులు సూచించారు.
According to @RachakondaCop, the huge traffic heading towards #AndhraPradesh from #Hyderabad for #Sankranthi festival, on 12th Jan, 56595 vehicles crossed the #Panthangi toll plaza in #Choutuppal and on 13th Jan, 67577 vehicles crossed.#Sankranti2023 #Sankranti#Sankranthi2023 pic.twitter.com/mCPfIYzrCT
— Surya Reddy (@jsuryareddy) January 14, 2023
According to Rachakonda Police the huge traffic heading towards Andhra Pradesh from Hyderabad for Sankranti festival on 12th January 56595 vehicles crossed the Panthangi toll plaza in Choutuppal and on 13th January 67577 vehicles crossed. pic.twitter.com/hWKlxrmurM
— Azmath Jaffery (@JafferyAzmath) January 14, 2023
As people from #Hyderabad , going to their native places for #sankranti festival, the NH-65 witnessed #Traffic snarls through the day as a sea of vehicles lined up to cross the Panthangi toll plaza near #Choutuppal , heading towards #AndhraPradesh.#Sankranthi #Sankranti2023 pic.twitter.com/KLMiCJaRQ2
— Surya Reddy (@jsuryareddy) January 13, 2023