జూన్ మొదటివారం దాటినా ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు (Heavy Temperature) తగ్గడం లేదు. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలౌతున్నది. రాత్రి 9 గంటల వరకు ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
Heavy Temperatures: జూన్ మొదటివారం దాటినా ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు (Heavy Temperature) తగ్గడం లేదు. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలౌతున్నది. రాత్రి 9 గంటల వరకు ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు (Morning Temperature) గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. శుక్రవారం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ (Telangana) పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజున గరిష్టంగా కరీంనగర్ జిల్లా (Karimnagar) జిమ్మికుంటలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా (Asifabad) కాగజ్‌నగర్‌లో 45.7 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem) జిల్లా బూర్గంపాడులో 45.7 డిగ్రీలు, పాల్వంచలో 45.6 డిగ్రీలు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జూన్ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు (Heat Waves) కూడా వీస్తున్నాయి. వడగాలులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడం, ఖమ్మం జిల్లాల్లో (Khammam District) సాధారణం కన్నా 6.5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం ఆందోళనకరం. శని,ఆదివారాల్లో కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. తీవ్రస్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలియజేశారు. వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని తెలియజేస్తున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల (North West Monsoon) ప్రభావం కేరళ(Kerala) , తమిళనాడు (Tamilanadu) రాష్ట్రాలపై ఉందని, మరికొన్ని రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు (Telangana Monsoon) వస్తాయని, వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చని వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు.