Numaish Exhibition: సందర్శకులతో కిక్కిరిసిన నుమాయిష్
Numaish Exhibition: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా పేరున్న హైదరాబాద్ నుమాయిష్ ప్రారంభం అయినప్పటినుండీ నగరవాసులు నుమాయిష్ కి వస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ఈ 46 రోజుల పాటు నుమాయిష్ జరుగనుంది. దేశ, విదేశాలకు చెందిన 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
సంక్రాంతి, ఆదివారం, పిల్లలకు సెలవులు ఇంకేముంది అందరు ఆదివారం నుమాయిష్ బాటపట్టారు. సందర్శకులతో నాంపల్లి అంతా కిక్కిరిసింది. పార్కింగ్ అధికారులు చేతులెత్తేశారు. అంతా జనం ఒక్కసారిగా రావడంతో నాంపల్లి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.
నాంపల్లి, గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. మెట్రో స్టేషన్ నుంచే రద్దీ కనిపించింది.
మధ్యాహ్నం 3 గంటలు ముందు నుంచే సందర్శకులు వచ్చారని స్టాళ్ల నిర్వాహకులు తెలిపారు. గేమ్ జోన్వద్ద పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారింది. ఆదివారం ఒక్కరోజే దాదాపుగా 80వేల మంది సందర్శకులు వచ్చారని ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది 25 లక్షలవరకు సందర్శకులు రావచ్చని అంచనావేస్తునట్లు వెల్లడించారు.