Sankranti Festival: పండక్కి ఊరెళుతున్న నగరవాసులు – కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
Sankranti Festival: సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో నగర వాసులుల తమ సొంత ఊళ్లకు బయల్దేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్ ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు వెళుతున్నారు. మరో రెండు రోజుల్లో స్కూల్స్ కు సెలవులు ఉండగానే ప్రయాణికులు ముందుగానే బయల్దేరి వెళ్తున్నారు.
సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి పండగకి ప్రత్యేక రైళ్లను ప్రకటించినా.. సీట్లు, బెర్త్‌లు దొరక్కపోవడంతో కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి సుమారు 12లక్షలకు పైగా సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారుబస్సులు,రైళ్లు ముందస్తుగా రిజర్వ్ అయిపోవడంతో సామాన్యులకు ఇబ్బందులు . తప్పడం లేదు. ఇటు రైల్వే స్టేషన్లలోను అదే పరిస్థితి కొనసాగుతోంది. జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో రైళ్లన్ని కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నాయి.
3,500 బస్సులకు అదనంగా పండగ స్పెషల్ 4,233 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది టీఎస్ ఆర్టీసీ ,ఏపీఎస్ఆ ర్టీసీ సైతం 1,850 బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు.. రోజూ 4-5వేల బస్సులను నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు స్వంత వాహానాలపై ఊళ్లకు బయలు దేరిన కార్ల తో హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల దగ్గర నిన్నటినుండి విపరీతమైన రద్దీ నెలకొంది.