Telangana Rains: హైదరాబాద్‌లో రాత్రంతా దంచికొట్టిన వాన..పలు జిల్లాలో వడగళ్లు
Telangana Rains: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వరణుడు యుకోశాన్ని చుపిస్తుననాడు. తెలంగాణాలో పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సము తీవ్ర రూపందాల్చింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు రహదారులన్ని జలమయమైయ్యాయి. అనేక జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో శనివారం పొద్దటి నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం మారిపోయింది. సాయంత్రం మొదలైన వాన రాత్రంతా కురుస్తూనే ఉంది.
ఉప్పల్ , ఎల్ బి నగర్, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, నారాయణగూడ, బేగంపేట, ప్యాట్నీ, తిరుమలగిరి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
మరో రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. గ్రామాలలో రాత్రి కురిసిన వడగండ్ల వానకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మామిడి పండ్ల తోటలు బాగా దెబ్బ తిన్నాయి. సూర్యాపేట జిల్లా నెల్లిబండ తండాలో గోడ కూలీ 20 గొర్రెలు మృతి చెందాయి. దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.