నరగంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం రాత్రి వరకు అధిక వేడి, ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు సోమవారం తెల్లవారు జాము చల్లని కబురు తీసుకొచ్చింది. హఠాత్తుగా వాతావరణం మారిపోయి అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలైంది.
Heavy Rain in Hyderabad: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం రాత్రి వరకు అధిక వేడి, ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు సోమవారం తెల్లవారు జాము చల్లని కబురు తీసుకొచ్చింది. హఠాత్తుగా వాతావరణం మారిపోయి అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలైంది. తెల్లవారు జామున 4 గంటల నుంచే వర్షం కురుస్తుండటంతో ప్రజలు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. గత 20 రోజులుగా అధికవేడితో అతలాకుతలం అవుతున్న నగర ప్రజానికం ఈ వానతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో ఆర్టిఫిషియల్గా చల్లదనాన్ని పొందుతున్న ప్రజలు ఈ వాన రాకతో నిజమైన చల్లదాన్ని పొందుతున్నారు. ఉదయం నుంచి నేరేడ్ మెట్, కుత్భుల్లాపూర్, ముషీరాబాద్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే తెలియజేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలియడంతో ప్రజలు దానికి దగినట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఈనెల 25న రోహిణి కార్తె ప్రవేశించబోతున్నది. జూన్ 8 వరకు ఈ కార్తె ఉంటుంది. మూడు రోజుల వర్షాలు అంటే 25 వరకు కురుస్తాయని అనుకోవచ్చు. కార్తె ప్రవేశించిన తరువాత వారం రోజులపాటు ఎండలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వారం రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాకాలంలోనూ ఎండలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కర్భన ఉద్గారాలు వాతావరణంలోకి అధికంగా విడుదల అవుతుండటంతో భూతాపం పెరుగుతున్నది. చల్లదనం కోసం వినియోగిస్తున్న ఏసీల నుంచి వెలువడే సీఎఫ్సీ వాయువుల ఈ తాపాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, లేదంటే రాబోయే ఐదేళ్లు జనజీవనం మరింత కష్టంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.