శంషాబాద్ పరిసరాల్లో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు
హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. భారీ వర్షానికి నగరంలోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించడంలేదు. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటి వరకు 4 విమాలను అధికారులు దారి మళ్లించారు. 2 ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించగా.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సి విమానాలను బెంగళూరుకు మళ్లించారు అధికారులు.
మరోవైపు నగరంలోని శంషాబాద్‌తో పాటు కొండాపూర్, మాధాపూర్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్ పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్ని జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.