Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం, పలుచోట్ల వడగళ్ల వాన
Heavy rain in some Parts of Hyderabad
హైదరాబాద్ నగరాన్ని వర్షం పలకరించింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ అల్వాల్ , బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో జోరుగా వాన కురిసింది. అదే విధంగా కూకట్ పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, మియాపూర్, అమీన్పూర్, చందానగర్, పటాన్ చెరువు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వర్షం కురిసిన ప్రాంతాలలోని ప్రజలు తమ కెమెరాలకు పనిచెప్పారు. వర్షం కురవడాన్ని కెమెరాలతో చిత్రీకరించారు. ఆ తర్వాత వాటిని ట్విట్టర్ అకౌంట్లలో పోస్టు చేశారు. నగరంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. శేరిలింగంపల్లి లోని చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది.
వానదేవుడికి ఈ రోజు కోపం వచ్చినట్లుందని..అందుకే వడగళ్ల వాన కురిపించాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. రానున్న 48 గంటల్లో నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నగరంలో కురిసిన వడగళ్ల వాన కొంత మంది వాహనదారులకు ఇబ్బందిని కలిగించింది. వాహనం మీద ప్రయాణం చేస్తున్న సమయంలో తమపై వడగళ్లు పడడంతో ఇబ్బదులు పడ్డారు. కొన్ని కార్లపై కూడా వడగళ్లు పడడంతో అద్దాలు పగిలిపోయాయి.
Rain and taillights paint the evening in #Hyderabad pic.twitter.com/CLrmEvzagB
— serish (@serish) March 18, 2023
Heavy rain in Chandanagar#HyderabadRains #Hyderabad #hyderabadweather pic.twitter.com/cbaNbscuLp
— Rajesh (@ThisisRajesh_) March 18, 2023
#HyderabadRains #Hyderabad @VizagWeather247
Hailstones rain started in Madhapur pic.twitter.com/QrlcY3wH4z— PVM💙 (@PVM1501) March 18, 2023
Massive Hail Rain In Hyderabad ☁️ pic.twitter.com/Ew5eF0il1z
— Swapnil Kommawar (@KommawarSwapnil) March 18, 2023
Hailstorm in Hyderabad. Looks like rain gods are very angry today… 😂 #HyderabadRains #hailstorm pic.twitter.com/T7qm0lr3LA
— Veera Reddy (@veera_iaf) March 18, 2023
.