Rain alert: హైదరాబాద్‌లో భారీ వర్షం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని ఎల్బీ నగర్, వనస్థలీపురం, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడా, తార్నాక, కొత్తపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడ నాలాలు ఉన్నయో అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది. పలు చోట్ల ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేసింది.
మరోవైపు చినుకు పడితే చిత్తడయ్యే మహా నగర పరిస్థితిని అధికారులు ఇంకా మార్చలేదు. పలు ప్రాంతాల్లో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షపు నీరును తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం జోరుగా వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు పలువురు మృతి చెందారు.