International Women’s Day 2023: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం… సమానత్వం దిశగా
International Women’s Day 2023: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున మహిళలు సాధించిన ప్రగతిని, వారి లక్ష్యాలను, వారి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను తెలుసుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఒక థీమ్‌ను తీసుకొని ఆ థీమ్‌కు అనుగుణంగా మహిళల లక్ష్యాలను నిర్దేశిస్తారు. 2023 ఏడాది ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాగా, నేడు వారు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. పురుషులు చేయలేని పనులను కూడా మహిళలు చేస్తుననారు.
సమయస్పూర్తి, సంకల్ప సిద్ధి, కార్యశీలతతో అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. అంతేకాకుండా సాంకేతికంగా అనేక ఆవిష్కరణలు చేశారు. సరికొత్త ప్రపంచం వైపుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. అనేక దేశాల్లో మహిళలు ఇప్పటికే ప్రధాని హోదాలో ఉండగా, కొందరు మహిళలు దేశ రక్షణలోనూ భాగస్వామ్యం అయ్యారు. ఇలా పురుషులకు మాత్రమే సాధ్యమౌతుందని అనుకున్న అన్ని రంగాల్లోనూ మహిళలు తమదైన ముద్రను వేసుకుంటున్నారు.