Summer Vacation: మార్చి 15 నుండి ఒంటిపూట బడులు
Half day and Summer vacation holiday schedule: ఎండాకాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి ఒంటిపూట బడులు, వేసవి సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు మార్చి 15 నుండి ఒంటిపూట బడులును నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15 నుండి ఏప్రిల్ 24వ వరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఇదే షెడ్యూల్‌ను ఫాలో కావాలని ఆదేశించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12వ తేదీన తిరిగి అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది. అయితే, 10 తరగతికి మినహాయింపు ఇవ్వనున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నది. 1 నుండి 9 వ తరగతి విద్యార్ధుల వరకు ఏప్రిల్ 12వ తేదీ నుండి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20వ తేదీతో పరీక్షలను పూర్తిచేసి 21వ తేదీన రిజల్ట్స్‌ను అందించాలి. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీన విద్యార్ధుల తల్లిదండ్రులతో మీటింగ్‌ను ఏర్పాటు చేసి అకడమిక్ ఇయర్ గురించి వారికి తెలియజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మీటింగ్ అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.