Gunfire Tension in Shamirpet: శామీర్ పేటలో కాల్పుల కలకలం… బెదిరించి నగదు దోపిడి
Gunfire Tension in Shamirpet: శామీర్ పేటలో కాల్పుల కలకలం రేగింది. కొంతమంది దుండగులు మంకీ క్యాప్ ధరింది శామీర్ పేటలోని మద్యం దుకాణం వద్దకు చేరుకొని కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడున్న వారంతా పరారయ్యారు. అనంతరం కత్తులు, గన్, కర్రలతో బెదిరించి వైన్ షాప్‌లోని నగదును ఎత్తుకెళ్లినట్లు స్థానికులు, దుకాణం దారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో గన్ తో బెదిరింపులు పెరిగిపోతున్నాయి. శివారు ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచనప్పటికీ ఇలాంది దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటన శామీర్‌పేట లోని మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో జరిగింది.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారని, వైన్ షాప్ నుండి రెండు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారని స్థానికులు పోలీసులకు పేర్కొన్నారు. వైన్ షాపులో పనిచేస్తున్న జైపాల్ రెడ్డి, బాలకృష్ణపై దుండగులు కర్రతలతో దాడిచేసి, తుపాకులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. కాగా, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లోని గన్ కల్చర్ క్రమంగా దేశంలోకి వస్తుండటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు.