Devara Karunakar: గుడిమల్కాపుర్ కార్పోరేటర్ కన్నుమూత, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అకాల మరణం
Gudimalkapur Corporator died due to Brain stroke
గుడిమల్కాపుర్ కార్పోరేటర్ దేవర కరుణకుమార్ మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అకాల మరణం పొందారు. బీజేపీ తరపున రెండు సార్లు పోటీ చేసి, రెండు సార్లు గెలిచారు. అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో కూడా ఎంతో సఖ్యతగా ఉండేవారు.
దేవర కరుణాకర్ అకాల మరణం పొందడంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంచితనాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ లోకేశ్ కుమార్ తమ దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. GHMC కౌన్సిల్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ఎంతగానో సహకరించేవారని మేయర్ గుర్తుచేసుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలతోను కరుణాకర్ ఎంతో సఖ్యతగా మెలిగేవారని మేయర్ తెలిపారు. అటువంటి వ్యక్తి మనల్ని విడిచిపెట్టడం ఎంతో బాధాకరంగా ఉందని అన్నారు