Group 1 Paper leak: టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్ధి సంఘాలు
Group 1 paper leak, Student Unions Protest at TSPSC office
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అంశం ఉద్రిక్తంగా మారింది. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని విద్యార్ధి సంఘాలు ముట్టడించాయి. పేపర్ లీకేజీకి కారకులను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TSPSC బోర్డును తొలగించారు. బీజేపీ విద్యార్ధి విభాగం, కాంగ్రెస్ విద్యార్ధి విభాగాలు కూడా ఆందోళన కారులకు అండగా నిలిచారు. లీకేజీ విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
లక్షలాది మంది విద్యార్ధులకు ఇబ్బంది కలిగించే ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించాలని, అధికారులను అరెస్టు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ ఇంకా ఎన్ని పరీక్షలకు చెందిన పేపర్లు లీక్ చేశాడో తేల్చాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి.
ప్రవీణ్ ఫోన్లో నగ్న చిత్రాలు
ప్రవీణ్ విచారణ సమయంలో ఫోన్ లో ప్రశ్నాపత్రాలతో పాటు కొందరు మహిళలకు చెందిన నగ్న చిత్రాలు బయటపడ్డాయి. ప్రవీణ్ ఫోన్లో ఎక్కువుగా మహిళల నెంబర్లే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో ఉద్యోగంలో చేరాడు. జూనియర్ అసిస్టెంటుగా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహించాడు. వెరిఫికేషన్ కోసం వచ్చే మహిళా విద్యార్ధులలో కొందరు విద్యార్ధులను ప్రవీణ్ ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో కొంత మందితో శారీరక సంబంధాలు కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.