ORR:హైదరాబాద్‌లో పరచుకున్న పచ్చదనం.. ఎక్కడంటే
Greenery Spread: వర్షాకాలం మొదలైంది. మొన్నటిదాకా ఎండలు మండిపోగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. వెరసి ఖాళీ ప్రదేశాల్లో పచ్చిక మొలకెత్తుతోంది. ఇలాంటి క్రమంలో హైదరాబాద్ నగరం చుట్టూరా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు వెంట ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఓఆర్ఆర్ పొడవునా.. ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. వెరసి సినిమాల్లో చూపించే సుందర దృశ్యాలకు ఏమాత్రం తీసిపోకుండా ఓఆర్ఆర్ కనిపిస్తోంది.
ఓఆర్ఆర్ తాజా పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని గురించి వివరిస్తూ తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓఆర్ఆర్ మీద వేర్వేరు ప్రాంతాల్లో తీసిన తాజా ఫొటోలను కూడా ఆయన జత చేశారు. ఓఆర్ఆర్ ఇలా అత్యంత సుందరంగా, ఆహ్లాదకరంగా మారిపోవడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ల కృషే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ మాత్రం చూపరులను ఆకర్శిస్తుంది.