Governor Tamilisai: టీఏస్ పీఎస్సీ పై గవర్నర్ సీరియస్ రెండురోజుల్లో నివేదిక ఇవ్వాలి
Governor Tamilisai : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలు రావడం పై సీరియస్ గా స్పందించిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై జరిపిన దర్యాప్తు పై, వెల్లడైన నిజాలపై సమగ్రమైన నివేదిక రెండు రోజుల్లో సమర్పించాలని టీఎస్పీఎస్సీని గవర్నర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ నివేదిక కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరగనుంది. మరోవైపు.. పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన నిందితులకు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, నిందితురాలు రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.