Governor Tamilisai Celebrates Sankranti Festival: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ సై
Governor Tamilisai Celebrates Sankranti Festival: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో ఆనందం నింపుతుందన్నారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. కొత్త వస్త్రాలతో పిల్లపాపలంతా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. రాజ్ భవన్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళ సై.. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై పొంగలి వండారు. మంచి పొంగల్ ఇది జి 20 పొంగల్ అని అన్నారు. అలాగే ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న అని అన్నారు.
అలాగే మలక్పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారని.. గైనకాలజిస్ట్గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులను మరింతగా మెరుగుపరచాలని సూచించారు.
తన వద్ద పెండింగ్ బిల్లులు ఏమీ లేవని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. తాను బిల్లులను పెండింగ్ లో పెట్టానని అనడం సరికాదన్నారు. యూజీసీ నిబంధనల మేరకు సమాచారం తెప్పించుకొని చూస్తున్నట్టుగా గవర్నర్ వివరించారు. అలాగే నేడు వందే భారత్ రైలును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.