Mla Raja Singh: రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చిన తెలంగాణ ప్రభుత్వం
Mla Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ మొరాయిస్తుందని.. పలుమార్లు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర డీజీపీకి, హోమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయిన కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై తరుచూ సీఎంకీ, డీజీపీకి లేఖ రాస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఇటీవల ఆయన ప్రగతి భవన్ ముందు ఆ వాహనాన్ని వదిలేసి వెళ్లారు.
ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ను రాజసింగ్‌కు కేటాయించారు. ఈ విషయం పై రాజాసింగ్ స్పందించారు. ప్రస్తుతం తాను శ్రీశైలం నుంచి హైదరాబాద్ బయలుదేరానని తెలిపారు. తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ధూల్ పేటలోని తమ ఇంటికి పోలీసులు తీసుకు వచ్చి పెట్టి వెళ్లారని చెప్పారు. కొత్త కారే తనకు కావాలని లేదని..మంచి కండిషన్ ఉన్న బుల్లెట్ వాహనం ఇస్తే తనకు అదే చాలని ఆయన స్పష్టం చేశారు. నేను వెళ్ళాక దాని కండిషన్ గురించి తెలుసుకుంటానని తెలిపారు.