బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా?
మార్కెట్లో బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
Gold Prices : పది రోజుల నుంచీ భగభగ మండిపోతున్న భానుడితో పోటీ ఎందుకనుకుందో ఏంటో కానీ.. ఈ మధ్య‘కనకం’ కాస్త శాంతిస్తోంది. ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు తానూ షాక్ ఇస్తే ఎలా అనుకుందో ఏమో కానీ.. మూడు రోజులుగా కాస్త కుదురుగానే ఉంటోంది. దీంతో ఆకాశాన్నంటుతూ వస్తున్న పసిడి ధరలు కాస్త నేల చూపులే చూస్తున్నాయి. అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి… ఇంకా తగ్గుతాయా.. దీనిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉంటున్నా.. ఇది వరకటితో పోల్చుకుంటే అవసరానికి కొనేవాళ్లు మాత్రమే కొంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి ఫంక్షన్లకు గోల్డును గిఫ్టుగా (gold as gift for functions) ఇచ్చే మధ్యతరగతి ప్రజలు (Middle class people).. ఇప్పుడు ఆ ఆలోచనకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేసారు. రూ. 60 వేలు పెడితే కానీ తులం బంగారం రావడం లేదు. ఆ పై కొనే ఆభరణాలపై తరుగు, మజూరు, జీఎస్టీ(Tax, Labor, GST) అంటూ రూ. 70 వేలు పైగానే చార్జ్ చేస్తున్నారు.. జ్యువెలరీ షాపు యజమానులు. దీనికి బదులు ఒక రూ. 50వేలు, 25 వేలో ఇచ్చేస్తే పెద్ద ఫిగర్ లాగే ఉంటుందని లెక్కలేసుకునే స్జేజికి వెళ్లిపోయారు మధ్య తరగతి వాళ్లు. కాదు కాదు.. ఆ పరిస్థితికి తీసుకువెళ్లింది పుత్తడమ్మ. అయితే ఈ వారంలో మాత్రం పసిడి ధరలు పైపైకి ఎగబాగకుండా ఉండటమే కాదు..రూ. 700, రూ.500 తగ్గుతూ భారీ ఊరటనే ఇస్తున్నాయి.
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా?
ఇటీవల రికార్డు స్థాయిలకు వెళ్లిన బంగారం ధరలు (Gold Prices).. ఇప్పుడు కాస్త కుదుటపడ్డాయి. వరుసగా మూడు రోజులు తగ్గుతూ .. సామాన్యులకు ఇది భలే మంచి సమయం అంటూ శుభవార్త వినిపిస్తోంది. అయితే వరుసగా పెరుగుతూ వస్తున్న ధరల ( Rising price)తో కొనేవారిలో ఆసక్తి తగ్గిపోవడంతో మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది. బంగారం ధర జీవన కాల గరిష్టాల వద్ద ఉండటంతో.. కొనేవాళ్లు అస్సలు ముందుకు రాకపోవడంతోనే పుత్తడి ధరలు కాస్త శాంతించాయి.
హైదరాబాద్ సంగతే చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి, రూ.55వేల 800 గా ఉంది. అలాగే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి, రూ. 60వేల 870 కి దిగింది. అదే బాటలో వెండి ధరలు కూడా కిలోకి రూ. 200 తగ్గి రూ. 74 వేల300కు చేరింది. ఈ మూడు నెలల్లో ఇంత ఎక్కువ స్థాయిలో పసిడి ధరలు తగ్గడం ఇదే ఫస్ట్ టైమ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నిపుణులు ఏమంటున్నారు?
అటు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర ఔన్స్ కు 1,975 డాలర్లు పడిపోగా.. వెండి ధర ఔన్స్ కు 23.60 డాలర్లు పడిపోయింది. రాబోయే కొద్ది రోజులు బంగారం ధరలు తగ్గినా తర్వాత మాత్రం ఎప్పటి లాగే పసిడి రికార్డు స్థాయిలకు చేరుకోవడం ఖాయమని.. మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (By the end of the financial year) తులం బంగారం ధర రూ.66,000-68,000 వరకూ దూసుకెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులతో బంగారంపై పెట్టుబడులు (Investments in gold) పెట్టొచ్చని.. దీని వల్ల 10 నుంచి 15 శాతం రిటర్న్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.