Hyderabad Floods: మూసీ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
హైదరాబాద్‌లో వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు GHMC యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అధికారుల ఆదేశాలతో జీహెచ్ఎంసీ సిబ్బంది బాధితులకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మూసీ నది పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యల్లో శరవేగంగా పాల్గొంటున్నారు.
గత కొన్ని రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండిపోయాయి. వాటి నుంచి మూసీనదిలోకి నీటి ప్రవాహం అధికమయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మూసీ నది పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1500 మందికి షెల్టర్ క్యాంప్‌లకు తరలించారు. వారందరికీ నివాసయోగ్యమైన స్థలాలతో బస ఏర్పాటు చేశారు. ఆహార పదార్ధాలను అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, రెవెన్యూ శాఖతో కలిసి ఈ సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన మేయర్ మూసీ ప్రాంతంలో ప్రజల తరలింపుకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు.
Evacuated 1500 residents residing near the musi downstream flowing areas & shifted them to shelter homes due to increased flow of flood water. All necessary arrangements have made at the shelter homes for the citizens in coordination with @CPHydCity, revenue department. @KTRTRS pic.twitter.com/EMzu9dNAMs
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) July 27, 2022