Free Bus Services for Women: హైదరాబాద్‌లో మహిళల కోసం ఉచిత బస్ సర్వీసులు
Free Bus Services for Women: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎంత సెక్యూరిటీని ఏర్పాటు చేసినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ఒంటరి మహిళలనే కాకుండా, బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో కూడా వారికి భద్రత లేకుండా పోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండు షీ షటిల్ బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలియజేశారు.
ఈ బస్ సర్వీసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుందని, మహిళలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఈ బస్సులో భద్రత కోసం ఓ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. మహిళల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన షీ షటిల్‌బస్ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలియజేశారు. సర్వీసుల వినియోగాన్ని అనుసరించి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలియజేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. భద్రత విషయంలో వెనకడుగు వేసేది లేదని అధికారులు పేర్కొన్నారు.