FoxconnChairmanYoung Liu: కేసీఆర్ గారు మాకు సహకరించండి.. ఫాక్స్‌కాన్ ఛైర్మన్
FoxconnChairmanYoung Liu: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఫాక్స్‌కాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ‘పాక్స్ కాన్’ సంస్థ ఛైర్మన్ యంగ్‌లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఇక హైదరాబాద్ రాయదుర్గంలో 78 వేల చదరపు అడుగులలో నిర్మించిన టి -వర్స్క్ భవనాన్ని ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ చేతుల మీదుగా ఈ మద్యే ప్రారంభించారు.
ఈమేరకు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్‌లియూ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ముందుగా హైదరాబాద్‌లో అతిథ్యానికి యంగ్‌లియూ కృతజ్ఞతలు తెలుపుతూ.. తెలంగాణలో వీలైనంత తొందరలోనే ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుచేస్తామని లేఖలో పేర్కొన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ పార్క్ పెడుతున్నామని, ఈపార్కు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వ సహకరాం కావాలంటూ కోరారు. అలాగే సీఏం కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానించారు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్‌లియూ.