KKR in BJP: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, త్వరలో బీజేపీ గూటికి..
Former CM of Andhra Pradesh Kiran Kumar reddy resigns from Congress Party
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని తెలుపుతూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కిరణ్ కుమార్ కలవనున్నారని ప్రచారం జరుగుతోంది.
కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్ నాథ్ రెడ్డి పీవీ నరసింహారావు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ నగరంలోనే జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్నారు. చదువు పూర్తికాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1వ తేదీ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు.
Not a big setback to #Congress
Cong leader N Kiran Kumar Reddy, who was known to be a sealed cover CM, resigned his party
He sent his resignation letter #INC prez .@kharge
Expected to join #BJP soon.@INCIndia @RahulGandhi @priyankagandhi pic.twitter.com/3rJVGGlkVG
— Sagar KV 💙 (@SagarVanaparthi) March 12, 2023
Former Chief Minister Kiran Kumar Reddy, also last CM of erstwhile #AndhraPradesh, resigns from #Congress. Strong buzz that he might join #BJP. pic.twitter.com/FyzFlJMJjJ
— Rishika Sadam (@RishikaSadam) March 12, 2023
..