రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న సందర్బంగా కేటీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ పర్యటన దిగ్విజయంగా సాగింది, ఆ తర్వాత ఇప్పుడు అమెరికా పర్యటన కూడా ఘనంగా ముగిసింది.
Minister KTR: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న సందర్బంగా కేటీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ పర్యటన దిగ్విజయంగా సాగింది, ఆ తర్వాత ఇప్పుడు అమెరికా పర్యటన కూడా ఘనంగా ముగిసింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 42వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు విదేశీ సంస్థలతో పలు ఒప్పందాలు జరిగాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి.
వెల్కమ్ టు అవర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ’అంటూ ఓఆర్ఆర్ తో పాటు ఐటి కారిడార్ లో పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ యువజన నాయకులు భారీ హోర్డింగ్స్ ఫ్లెక్సీ లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ యువతకు 42 వేల ఉద్యోగ అవకాశాలతో వస్తున్నందుకు ధన్యవాదాలు రామన్న అంటూ ఫ్లెక్సీల్లో రాసారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 23,032 పరిశ్రమలు ఏర్పాటు కాగా, రూ. 2,62,049 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. 17,61,778 ఉద్యోగాలు తెలంగాణకు వచ్చాయి. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ బ్రిటన్, అమెరికాల్లో జరిపిన పర్యటనల సందర్భంగా పలు గ్లోబల్ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, విస్తరణ ప్రణాళికలతో ముందుకు వచ్చాయి. దాదాపు రూ.5800 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించగా, మరికొన్ని సంస్థలు పెట్టుబడి వివరాలను వెల్లడించాల్సిఉంది. కేటీఆర్ తన సమవేశం 80కిపైగా బిజినెస్ సమావేశాలు నిర్వహించారు. పలు బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక మందితో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న వనరులు, అనుకూల పరిస్థితులను వారికి వివరించారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న సంస్థల పురోగతిని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వాళ్లకు వివరించారు.
Heartily welcomes you, @KTRBRS Anna.
42k Jobs It's not so easy there is a lot of hard work
Wellcome back home anna @KTRBRS #KTR pic.twitter.com/JZPZOddzcm— Aravind Alishetty (@aravindalishety) May 30, 2023