నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్(Miyapur Police Station) పరిధిలో బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. మదీనాగూడలోని(Madina Guda) కినార గ్రాండ్ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో(Elite restaurant) జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్(Devender Gayan)(35)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు.
Hyderabad : నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్(Miyapur Police Station) పరిధిలో బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. మదీనాగూడలోని(Madina Guda) కినార గ్రాండ్ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో(Elite restaurant) జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్(Devender Gayan)(35)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు.
దేశవాలీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా దేవేందర్ గాయన్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
దేవేందర్ స్వస్థలం కోల్‌కతాగా పోలీసులు తెలిపారు. కాల్పులకు పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారని.. కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్‌ని ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే దేవేందర్ 6 నెలలుగా కినార గ్రాండ్ సందర్శిని హోటల్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
సంఘటన స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు, మియాపూర్ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ సందీప్ రావు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల గాలింపు చేపట్టారు.