Fire accident: సికింద్రాబాద్ ప్యాట్నీ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
Fire accident in Swapnalok Complex in Secunderabad
సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద గల స్వప్న లోక్ కాంప్లేక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..స్వప్నలోక్ కాంప్లేక్స్ లోని 7,8 అంతస్థులో ఓక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా దట్టంగా పోగలు వ్యాపించడంతో కార్యలయాల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పలు కార్యలయాలతో పాటు వాణిజ్య సముదాయలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు ఫ్లోర్ లోని రూంలలో ఉండిపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేపనిలో అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. మొత్తం 12 మంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. అందులో ముగ్గురిని ఇప్పటికే రక్షించారు. మిగతా 9 మందిని కాపాడే పనిలో ఉన్నారు.
వ్యాపిస్తున్న పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విషయం తెలియడంతో అగ్ని మాపక దళాలు రంగ ప్రవేశం చేశాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ ఉంది. ఇందులో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు ఉన్నాయి. మంటలు వ్యాపించడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలలోని ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.
@hydcitypolice @HiHyderabad
Swapnalok complex catch fire pic.twitter.com/NFFxuUh5Bf— Ganesh Kurukuntala (@kurukuntala) March 16, 2023
#swapnalok complex #secunderabad #Hyderabad #fireaccident #fire #accident pic.twitter.com/YJ2mFzMwy6
— Boini suvarna (@boini_suvarna) March 16, 2023
Fire breaks out at Swapnalok complex Secunderabad @TelanganaFire fighters pressed into service pic.twitter.com/QhuXsJClpV
— S.M. Bilal (@Bilaljourno) March 16, 2023
Fire Accident at Swapnalok complex in secunderabad on Thursday evening. @XpressHyderabad @NewIndianXpress @madhavitata @balaexpressTNIE @Bachanjeet_TNIE pic.twitter.com/9vNKlTlG5f
— R V K Rao_TNIE (@RVKRao2) March 16, 2023