Hyderabad: రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ ఇంజన్లు
Fire accident at Ramgopalpet in Hyderabad
హైదరాబాద్ లోని రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలియడంతో పోలీసులు బలగాలు, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు భవనం మొత్తానికి వ్యాప్తి చెందాయి.
భవనం లోపల చిక్కుకుపోయిన కొంతమంది వ్యక్తులను ఫైర్ సిబ్బంది రక్షించింది. భవనం వద్దకు భారీ హైడ్రాలిక్ క్రేన్ రప్పించిన ఫైర్ సిబ్బంది..సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మంటలను అదుపు చేసేందుకు 3 ఫైర్ ఇంజన్లు రంగంలో దిగాయి. ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి భవనం ముందు రాకపోకలను నిలిపివేశారు.
ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన ప్రదేశం పక్కనే ప్రైవేట్ ఆస్పత్రి ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగల కారణంగా ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది, రోగులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. కమర్షియల్ కాంప్లెక్స్ లు నిబంధనలు పాటించట్లేదని అందువల్లనే తరుచు అగ్నప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గతం లో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేస్తే…అంతా వ్యతిరేకించారని, ఇప్పటికైనా వ్యాపారులు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టీ, కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని మంత్రి తలసాని అన్నారు.
జనావాసాల మధ్య ఇటువంటి వ్యాపారాలకు అనుమతి ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే అగ్ని మాపక దళాలు రంగంలో దిగాయని, నలుగురిని కాపాడాయని అధికారులు తెలిపారు. భవనంలో చిక్కుకున్న మరో ఇద్దరిని రక్షించే ప్రయత్నం కూడా జరుగుతోందని, వాళ్ళ ఫోన్స్ కలువట్లేదని తలసాని తెలిపారు.
I’m not any expert in fire fighting. But looks like the strategy now is to “wait and it let it burn down to ashes” water is been scarcity and might not work to put down fire caused by polystyrene. #ramgopalpet #hyderabadfire #telaganafire #fire #deccannightware
— Vamsi Krishna (@vamsi_krsna) January 19, 2023
Massive #fire breaks out in a building at Nallagutta in #Ramgopalpet ps limits in #Secunderabad, huge #smoke coming out.
6 fire engines trying to douse the #Flames , firefighters rescued 4 people, 2 more people feared to be still trapped.#fireaccident #Hyderabad #FireSafety pic.twitter.com/y0qKIEFvWh
— Surya Reddy (@jsuryareddy) January 19, 2023