Hyderabad : నిత్య పెళ్లికొడుకు కేసులో ట్విస్ట్
False Accusations Says Adapa Sivasankar Babu in Marriage Fraud : రెండు రోజులుగా కొండాపూర్ లో పక్కపక్క గల్లీలలోనే పెళ్లిళ్లు చేసుకున్న వారిని పెట్టి, ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గరికి వెళ్తున్నాడు అంటూ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక యువకుడి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానికి కారణం తామిద్దరం మోసపోయామంటూ ఇద్దరు మహిళలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టడమే. అయితే అదంతా నిజం కాదని, కావాలనే తన మీద ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని, సదరు వ్యక్తి ఇప్పుడు గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహించాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివ శంకర్ బాబు పేస్ మీట్లో మాట్లాడుతూ కొంతకాలం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా పని చేశానని, తనకు మామయ్య వరసయ్యే గల్లా శ్రీనివాస్, గిద్దలూరు శ్రీరంగ శ్రీనివాస్ ఇద్దరూ వ్యాపారాల పేరుతో తన వివరాలతో బ్యాంకు రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి దగ్గర డబ్బులు గుంజి భోగస్ కంపెనీలు పెట్టారని, శ్రీరంగ శ్రీనివాస్ కు అమ్మాయిల వ్యసనం ఉందని, తన వద్దకు అమ్మాయిలను పంపాలని ఒత్తిడి తెచ్చాడని వెల్లడించాడు. అయితే అందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఇలా మహిళలతో తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నాడని తెలిపాడు. తాను నిజంగానే అన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మిగతా వారు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా? అని ప్రశ్నించిన శివ తనకు పెళ్లయిందని, కానీ వివాదాల కారణంగా తన భార్యకు చాలాకాలంగా దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అంతేకాదు తాను ఓ మహిళతో సహజీవనం చేస్తున్నానని, ఆమె ఇప్పుడు గర్భవతి అని శివ శంకర్ వెల్లడించాడు.