Hyderabad: నకిలీ డాక్టర్ ఆటకట్టించిన పోలీసులు
Fake Docter arrested in Hyderabad: హైదరాబాద్ లో ఒక నకిలీ డాక్టర్ ఆటకట్టించారు పోలీసులు. ఈ సంధర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయం లో వైద్యుల కు బాగా డిమాండ్ పెరిగిందని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫేక్ డాక్టర్ భాగోతం గుట్టురట్టు చేశామని, ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలినీలో ఆర్కే హాస్పటల్ లో ఎండీ ఫిజీషియన్ గా చలామణి అవుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని అనాన్రు. ఫేక్ డాక్టర్ కుదిలెట్టి విజయ్ కుమార్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన విజయ్ కుమార్ 2014 లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో B.sc పూర్తి చేశారు.
నగరంలోని పలు హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేసిన విజయ్, అప్రోజ్ ఖాన్ తో అనే వ్యక్తికి పరిచయం అయ్యాడు. విజయ్ కి నకిలీ సర్టిఫికెట్స్ ఇప్పిస్తానని అప్రోజ్ చెప్పిన సర్టిఫికెట్స్ ఇప్పించడంతో ఆయనకు 2 లక్షలు కమిషన్ కూడా ఇచ్చాడు. రష్యా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ ను మొత్తం 6 లక్షల 50 వేలకు కొనుగోలు చేశాడు విజయ్. మొత్తం ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు. ఫేక్ సర్టిఫికెట్ తయారుచేసిన మహబూబ్ అలీ జునైద్, అఫ్రోజ్ ఖాన్ లను కూడా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు విజయ్ పై దృష్టి సారించామన్న ఆయన ఇలాంటి నకిలీ సర్టిఫికెట్స్ తో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత సంవత్సరం నుండి విజయ్ వివిధ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడని, నకిలీ డాక్టర్ దగ్గర నుండి నకిలీ సర్టిఫికెట్స్, ఒక కార్, రెండు పాస్ పోర్ట్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.