Etela Rajender: ప్రీతి మరణానికి వేధింపులే కారణం – ఈటెల రాజేందర్
Etela Rajender comments on Preethi death case
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈటల గుర్తుచేశారు.ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్టీ అధికారిగానీ, ఒక్క ఎస్సీ అధికారి గానీ లేరని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. అసెంబ్లీలో ఒక్క దళిత మహిళ ఎమ్మెల్యే లేరని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూద్ చేసిన వ్యాఖ్యలను ఈటల గుర్తుచేశారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్ధుల్లో 1000 మంది మధ్యలోనే చదువు వదిలేసి వెళ్లిపోతున్నారని, 500 మంది చనిపోతున్నారని చంద్రచూద్ తెలిపారు. మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణంపై కూడా ఈటెల రాజేందర్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణానికి వేధింపులే కారణమని అన్నారు. చనిపోయిన ప్రీతికి చికిత్స చేశారని ఈటెల ఆరోపించారు.