Etela Rajendar: కవితకు ఈడీ నోటీసులు.. ఈటెల ఏమంటున్నారంటే?
Etela Rajendar: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ నోటీసులు గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్ స్పందించారు. ఈడీ నోటీసులు ఈరోజు ఇచ్చినవి కాదని పేర్కొన్న ఆయన చాలా రోజుల నుంచి విచారణ జరుగుతుందని అన్నారు. ఇక స్వయంగా కెసిఆర్ గారు చాలాసార్లు చెప్పారు, నా కుటుంబ సభ్యులు కూడా తప్పు చేస్తే నేను క్షమించను అని ఇప్పుడు అసలు విచారణ కూడా చేయనివ్వకపోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇక దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలు ఉంటేనే నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారని, కోర్టు కూడా ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఈ కేసులో ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని కామెంట్ చేసినట్టుందని ఆయన అన్నారు. ఇక ఎవరు తప్పు చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆయన అన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేయగా ఆమె రేపటి ఈడీ విచారణను హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే కవిత విజ్ఞప్తిపై ఇప్పటివరకు ఈడీ నుంచి ఏ స్పందన రాలేదని తెలుస్తోంది. ఇక మరోపక్క కవిత బంజారాహిల్స్ నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. కాసేపట్లో శంషాబాద్ నుంచి ఆమె ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కవిత ఈడీ ముందుకు హాజరు కానున్నారా లేదా జంతర్‌మంతర్ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్నారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.