Election Commission of India: టీఆర్ఎప్ పార్టీ కార్యాలయం చిరునామాలో తప్పులు
Election Commission of India: టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అయితే, ఈ లేఖలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్ నగరంలో ఉన్నట్లుగా పేర్కొన్నది. ఆ తప్పును గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం తప్పును సవరిస్తూ టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాసింది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్నట్లుగా పేర్కొన్నది. టీఆర్ఎస్ నేతలు ఈ తప్పును గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో సవరించింది. కాగా, నిన్న మధ్యాహ్నం 1:30 గంటలకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ అధికారికంగా సంతకం చేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. దీనికోసం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్ రాజ్‌లు హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.