క్యాసినో ఈవెంట్ కింగ్ చీకోటి ప్రవీణ్‌ను ఈడీ ఈరోజు ప్రశ్నించింది. సుమారు ఏడు గంటలపాటు ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నగదు లావాదేవీలు, విదేశీ ప్రయాణాలపై ఈడీ ఆరా తీసింది. చాలా కాలంగా చీకోటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో నిర్వహిస్తున్నాడు. చీకోటి చీకటి కోణంపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ముందు హాజరయ్యారు.
Chikoti Praveen: క్యాసినో ఈవెంట్ కింగ్ చీకోటి ప్రవీణ్‌ను ఈడీ ఈరోజు ప్రశ్నించింది. సుమారు ఏడు గంటలపాటు ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నగదు లావాదేవీలు, విదేశీ ప్రయాణాలపై ఈడీ ఆరా తీసింది. చాలా కాలంగా చీకోటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో నిర్వహిస్తున్నాడు. చీకోటి చీకటి కోణంపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ముందు హాజరయ్యారు. భారీగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైనే ఈడీ ప్రశ్నలు అడిగినట్లు చీకోటి ప్రవీణ్ తెలియజేశాడు. థాయ్‌లాండ్ ఘటనపైనే ఈడీ విచారించినట్టు చీకోటి తెలిపారు. థాయ్‌లాండ్‌లో తాను ఫైన్ కట్టి వచ్చానని అన్నారు.
బెయిల్ కూడా తీసుకోలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పట్లో తాను క్యాసినో ఈవెంట్లను నిర్వహించే ఆలోచనలో లేనని అన్నాడు. తాను థాయ్‌లాండ్‌లో కేవలం ఓ ప్లేయర్ గా మాత్రమే హాజరయ్యాయని అన్నాడు. అందరూ అనుకున్నట్టుగా తాను ఆర్గనైజర్‌గా కాదని అన్నాడు. థాయ్‌లాండ్‌లో క్యాసినో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసినవాళ్లు ఇప్పటికే థాయ్ జైల్లో ఉన్నారని చీకోటి తెలియజేశాడు. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా తాను హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చీకోటి ప్రవీణ్ తెలియజేశారు. తన కారు గురించి గతంలోనే ఈడీ, ఐటీ అధికారులకు చెప్పానట్టు చీకోటి ప్రవీణ్ తెలియజేశాడు. చీకోటి ప్రవీణ్ చీకటి కోణాల గురించి ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. చీకోటిపై దేశ విదేశాల్లో అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే.