హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏసీ బస్సులను ప్రారంభించింది. ఈ గరుడ పేరుతో పిలవబడే ఈ ప్రత్యేక ఏసీ బస్సులను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
E garuda AC Bus services from today
హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏసీ బస్సులను ప్రారంభించింది. ఈ గరుడ పేరుతో పిలవబడే ఈ ప్రత్యేక ఏసీ బస్సులను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రూట్లో మొత్తం 50 బస్సులు సేవలు అందించనున్నాయి. ప్రస్తుతం వాటిలో 10 బస్సులను ఈ రోజు ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నాటికి మిగతా 40 బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
సికింద్రాబాద్, విజయవాడ రూట్లో ప్రతి 20 నిమిషాలకు ఒక ఏసీ బస్సు నడపాలని తెలంగాణ ఆర్టీసీ ప్లాన్. ఆ పథకంలో భాగంగా ఈ రోజు తొలి విడతగా 10 ఏసీ బస్సులు ప్రారంభం అయ్యాయి. వీటితో పాటు వచ్చే రెండేళ్లలో తెలంగాణలో మొత్తం 1860 ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. 1860 ఎలక్ట్రిక్ బస్సుల్లో 1300 బస్సులు హైదరాబాద్లోను మిగతా బస్సులు ఇతర సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.
హైదరాబాద్ నగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ ఆధునీకరణలో భాగంగా అనేక చర్యలు చేపడుతున్న ఎండీ సజ్జనార్ డబుల్ డెక్కర్ బస్సుల విషయంలోను ఓ క్లారిటీతో ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.