Indian Racing League: మొదటి రోజు ముగిసిన కార్ రేసింగ్..నిరాశలో ప్రేక్షకులు
Indian Racing League: హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ పోటీలు తొలి రోజు ముగిశాయి. మొదటి రోజున కేవలం రెండు ప్రాక్టీస్ సెషన్స్ ను మాత్రమే నిర్వాహకులు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు రేసింగ్ పోటీలను జరగాల్సి వుండగా మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఈ పోటీలపై మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో అన్ని క్వాలిఫైయింగ్ పోటీలను నేడు నిర్వహించాలనే ఆలోచనకు నిర్వహకులు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రేసింగ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.
రేసింగ్ ప్రారంభమైన తరువాత రెండు కార్లు ఆగిపోయాయి. దీంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయి. ఇక సాంకేతిక కారణాలతో చాలా ఆలస్యంగా స్పోర్ట్స్ కార్లు ట్రాక్ పైకి వచ్చాయి. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో నేడు మూడు క్వాలి ఫైయింగ్ రేస్‌లను నిర్వహించనున్నారు.
ఇక ఫిబ్రవరి 11న అసలైన ఇండియన్ రేస్ పోటీలు జరగనున్నాయి. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఆటోమొబైల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్ రేసింగ్ పోటీలకు వివిధ ప్రపంచ దేశాల నుంచి దాదాపు 30వేల నుంచి 35వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది.