Minister Sabitha Indra Reddy: డ్రగ్స్ వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దు..మంత్రి సబితా
Minister Sabitha Indra Reddy: విద్యా సంస్థల్లోకి మాదక ద్రవ్యాలు వాడడం ఎక్కువగా వింటున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కన్వెన్షన్ హాల్‌లో మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..విద్యా సంస్థల్లోకి మాదక ద్రవ్యాలు క్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు. విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.
ర్యాగింగ్ ను ఏ విధంగా రాష్ట్రప్రభుత్వం నిర్మూలించిందో అదేవిధంగా డ్రగ్స్ వాడకాన్ని కూడా నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ ను వాడి విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం కళాశాల నుండి పాఠశాలకు చేరకముందే కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఈ సందర్బంగా సూచించారు. విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను షీటీమ్ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, నైనా జైస్వాల్, పాల్గొన్నారు.