CSE రిలీజ్ చేసిన సంచలన రిపోర్టు
కూల్ కూల్ గా విషం తాగేస్తున్నారు..
cool drinks : ఒక్కోసారి మనకు తెలిసిన విషయమే అయినా చాలా లైట్ తీసుకుంటాం. తీరా జరగాల్సిన డ్యామేజ్ జరిగాక అయ్యో అప్పుడు ఆ పని చేయకుండా ఉండాల్సిందంటూ విచారిస్తూ కూర్చుంటాం. కూల్ డ్రింక్స్ (cool drinks) విషయంలో అందరూ చేసేది అదే. కూల్ డ్రింక్స్ మంచివి కావన్న విషయం అందరికీ తెలుసు. అయినా తాగుతాం. చివరకు చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసి చేజేతులా వాళ్లనూ రిస్క్ లో పడేస్తున్నాం. అయితే మనం తాగుతున్న కూల్ డ్రింక్స్ లో.. ఆ కంపెనీలు ఎంత శాతం ఫెస్టిసైడ్స్ కలుపుతున్నాయో తెలిస్తే .. వామ్మో అని గుండెల మీద చేయి వేసుకుంటాం. అవును.. డేంజరస్ రసాయనాలు (Dangerous chemicals), పురుగుల మందు (pesticides) లతో చల్లచల్లని.. తీయతీయని పానీయాలు తయారు చేస్తున్నాయి కూల్ డ్రింక్స్ కంపెనీలు. కూల్ గానే మన ప్రాణాల్ని తీసేయడానికి .. కలర్ ఫుల్ రంగులేసి మరీ మార్కెట్లను నింపేస్తున్నాయి.
నిజానికి ఇప్పుడు చాలామంది నీళ్లకు బదులు కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ఇక సమ్మర్ వచ్చిందంటే నేచురల్ వాటర్ అయిన నీళ్లు, కొబ్బరి నీళ్లను (coconut water) చీప్ గా చూస్తూ.. కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కానీ తాము తాగుతుంది చల్లని గరళం (cold poison) అన్న విషయాన్ని ఏ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజానికి కూల్ డ్రింక్స్ తాగితే అనారోగ్యాలు వస్తాయని తెలుసు. లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని తెలుసు అయినా ఆ చల్లదనం , తీయదనం కలగలిపిన డిఫరెంట్ ఫ్లేవర్ కు బానిసలయిపోతున్నారు. వీరి వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవడానికి ఒక్కో కంపెనీ హానికరమైన పురుగు మందులను (Harmful pesticides) కలిపేసి ప్రజల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నాయి. అయితే ఇప్పుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (CSE ) రిలీజ్ చేసిన సంచలన రిపోర్టు అందరి వెన్నులో వణుకును పుట్టిస్తోంది.
ఫాంటా 29.1 శాతం, ఫ్రూటీ 24. 5 శాతం, మిరిండా 20.7 శాతం, మాజా 19.3 శాతం, 7 అప్ 12. 5 శాతం, పెప్సీ 10.9 శాతం, కోక్ 9.4 శాతం, థమ్స్ అప్ 7.2 శాతం, స్ప్రైట్ 5.3 శాతం లెక్కన ఫెస్టిసైడ్స్ కలిపి కలర్ ఫుల్ బాటిల్స్ తో మార్కెట్లోకి వదిలేస్తున్నాయి ఈ కంపెనీలు. అయితే దీనిలో విచారించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే.. ఎక్కువ ఫెస్టిసైడ్ కలిపిన కంపెనీలలో టాప్ లో ఉన్న ఫాంటా, ఫ్రూటీ, మిరిండా, మాజా కూల్ డ్రింక్స్ లో ఫ్రూట్స్ ప్లేవర్ ఉండటంతో చిన్నారులు కూడా వీటిని ఎక్కువగా తాగుతారు. ఒకవిధంగా చెప్పాలంటే మనమే వాళ్లకు అలవాటు చేస్తున్నాం. అక్కడ తీపిని , అందులో చల్లదనాన్ని చూస్తున్నాం కానీ దాని వెనుక దాగి ఉన్న విషంతో.. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేస్తున్నామని ఆలోచించలేకపోతున్నాం. పంటల్లో పురుగుల నివారణకు వాడే ఫెస్టిసైడ్స్ ను .. మనమే మన చేతులతో ఇస్తున్నాం.
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల జరిగే అనర్థాలు..
కూల్ డ్రింక్స్ లో ఉండే రసాయనాలు, పురుగుల మందులు (pesticides)లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో ఉండే ఫాస్పారిక్ యాసిడ్ శరీరంలో కాల్షియం లోపించేలా (Calcium deficiency) చేస్తాయి. దంతాలు త్వరగా పాడయ్యేలా చేస్తాయి. ఎముకలతో పాటు కండరాల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. అంతేకాదు పెద్దవారిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి లైంగిక వాంఛలను చంపేస్తాయి. శరీరానికి చల్లబర్చడానికి తాగే కూల్ డ్రింక్స్ యాసిడ్ స్థాయిలను పెంచి షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి.
350 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్ లో.. 35 నుంచి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. మనం చెక్ చేయించుకుంటే కూల్ డ్రింక్ తాగిన ఐదు నిమిషాల్లోనే మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడాన్ని గమనించవచ్చు. అంతేకాదు డయాబెటిస్ లేని వారు కూడా రెగ్యులర్ గా కూల్ డ్రింక్స్ తాగినే 67% వరకూ రిస్క్ ను కొని తెచ్చుకున్నట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. కూల్ డ్రింక్ లో ఉండే బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అనే రసాయనం.. నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తాయి. కూల్ డ్రింక్స్ అతిగా తాగితే జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది. అంతేకాదు వీటి నిల్వ కోసం వాడే ఫాస్ఫేట్స్, ఫాస్ఫారిక్ యాసిడ్లు చర్మం సాగే గుణాన్ని తగ్గించడంతో చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తారు.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల బ్లడ్ లో ట్రైగ్లిసరైడ్లు 30 శాతం పెరిగిపోతాయి. ఇవి గుండె రక్తనాళాలను గట్టిపరుస్తాయి. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగితే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. అలాగే గుండె కొట్టుకొనే తీరులోనూ మార్పులు వస్తాయి. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే రక్తపోటు పెరగటంతో.. కొన్ని సందర్భాలలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. డీ హైడ్రేషన్ కూడా ఏర్పడుతుంది. అంతేకాక కిడ్నీలపై కూడా విపరీతమైన భారం పడుతుంది.
ఇన్ని అనర్థాలు ఉన్నాయని తెలిసినా కూల్ డ్రింక్స్ రుచికి చిత్తవుతూ లైఫ్ నే రిస్క్ లో పెట్టుకుంటున్నాం. పంటల కోసం వాడాల్సిన ఫెస్టిసైడ్స్ ను డైరక్టుగా పొట్టలో పోసేస్తున్నాం. ఇప్పటికే మారుతున్న వాతావరణం, అలవాట్లతో కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న జీవితాలను… తెలిసి తెలిసి రసాయనాల మయం చేసేస్తున్నాం. చివరకు కంటికి పాపలా కాపాడుకోవాల్సిన చిన్నారులకు కూడా.. మనకు తెలియకుండానే కాలకూట విషాన్ని ఇచ్చి డేంజర్లోకి నెట్టేస్తున్నాం. ఇప్పటికైనా తేరుకోకపోతే మనమే కాదు.. మన భవిష్యత్తుకు మారు రూపమైన మన చిన్నారులు కూడా రిస్కులో పడిపోతారు. చివరిగా ఒకమాట.. అమ్మేవాడు తన బతుకు తెరువు కోసం వేయి అబద్ధాలు ఆడో.. మసిపూసి మారేడు కాయ చేసో తమ ప్రొడెక్ట్ ను అమ్ముకుంటాడు.. కానీ తెలిసి తెలిసి డబ్బు పెట్టి మరీ అనారోగ్యం కొనుక్కుంటున్న మనమే ఏం కొనాలో ఏం తినాలో.. ఏం తాగాలో ఒక్క క్షణం ఆలోచించుకోవాలి.