Passport: సర్వర్‌లో సమస్య.. నిలిచి పోయిన పాస్ పోర్ట్ సేవలు
Passport Office Server Down: హైదరాబాద్ నగరంలోని బేగంపేట్, అమీర్‌పేట్‌లోని పలు పాస్‌పోర్ట్ ఆఫీస్‌ల ముందు యువకులు నిరసనకు దిగారు. కార్యాలయాల్లో పలు కారణాలతో పాస్‌పోర్ట్ సేవలు నిచిపోవడంతో దరఖాస్తు చేసుకున్న యువతీ, యువకులు సెంటర్ల ముందు క్యూ కట్టారు. సర్వర్‌లో సమస్యలు తలెత్తడం వల్లే పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. సమస్యలపై ఆఫీస్ సిబ్బంది స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో పోస్పోర్ట్ కోసం వచ్చిన యువకులు నిరసనకు దిగారు.
తాము వివిధ ప్రాంతాల నుంచి వచ్చామని వారు తెలిపారు. ఉదయం నుంచి పాస్ పోర్ట్ ఆఫీస్ వద్దే నిరీక్షిస్తున్నామన్నారు. సాంకేతిక సమస్యలకు గల కారణాలపై సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి సమాధానాలు రాకపోవడంతో పాస్ పోర్ట్ కేంద్రాల వద్దే వారు నిరసనకు దిగారు. ఉదయం నుంచి క్యూలైన్లో ఉన్నామని.. తమకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు వారు వాపోయారు.