ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ఇద్దరు బడా వ్యాపారులను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో శరద్ రెడ్డికి మద్యం వ్యాపారం ఉన్నది. అదే విధంగా అరబిందో ఫార్మా కంపెనీలో శరత్ రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 21,22,23 తేదీల్లో అరబిందో ఫార్మా గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఉన్న పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ఇద్దరు బడా వ్యాపారులను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో శరద్ రెడ్డికి మద్యం వ్యాపారం ఉన్నది. అదే విధంగా అరబిందో ఫార్మా కంపెనీలో శరత్ రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 21,22,23 తేదీల్లో అరబిందో ఫార్మా గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఉన్న పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ కంపెనీకి ఆయన డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మద్యం కుంబకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను ఎఫ్ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. మద్యం కుంబకోణం కేసులో పెన్నాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్నది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలను చెల్లించినట్లు గుర్తించారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై ఈడీ, సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.