AAP Telangana: మేము కేసీఆర్ తో కొట్లాడుతున్నాం ..మీరేమో దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఆప్ నేతలు
AAP Telangana: హైదరాబాద్ కి వచ్చిన ఆప్ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తెలంగాణ ఆప్ నేతలు ఇందిరా శోభన్ తో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణాలో నియంత పాలనా కొనసాగుతుంది. నిరుద్యోగం పెరిగింది. ప్రశించినవారిపై కేసులు పెడుతున్నారు. తెలంగాణలో మనపార్టీ(ఆప్) సీఎం కేసీఆర్ పై యుద్ధం చేస్తుంది. కేసీఆర్ తో రాజకీయ వేదిక పంచుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ అందరిని రాజకీయంగా వాడుకుంటారు. తెలంగాణ లో మన పార్టీ కొట్లాడుతుందే కేసీఆర్ తో.. మీరు ఖమ్మం సభ కి వెళ్లడం సరికాదని తెలంగాణ ఆప్ నేతలు సూచించారు.
తెలంగాణాలో సీఎం కేసీఆర్ పై యుద్ధం చేస్తుంది మనపార్టీ అని తెలుసు కానీ ఖమ్మం సభ గురించి నాకు తెలియదన్నారు అరవింద్ కేజ్రీవాల్. కంటి వెలుగు కోసం మాత్రమే నన్ను ఆహ్వానించారు కానీ ఈ సభ గురించి నాకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆమధ్య కేసీఆర్ కూడా మన పార్టీని మన పథకాలను చూడటానికి వచ్చారు కదా అలాగే కంటి వెలుగు మంచి కార్యక్రమం కదా అని వచ్చానని అన్నారు. ఖమ్మం లో నేను ఏం మాట్లాడతానో మీరే చూడండి అని తెలంగాణ నేతలకు తెలిపారు.