Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో టూరిస్ట్‌లకు తప్పిన ప్రమాదం
Husensagar Tourist Boat: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో సాంకేతిక లోపంతో బోటు నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 60 మంది సందర్శకులతో హుస్సేన్‌సాగర్‌లోని బుద్దుని విగ్రహం వద్దకు వెళ్లిన బోటు తిరుగు ప్రయాణం అయింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బోటు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో సందర్శకులు బయాందోళనకు గురయ్యారు. అప్రత్తమైన సిబ్బంది స్టీమర్ బోట్లను రప్పించారు. వాటి సహాయంతో పెద్ద బోటును ఒడ్డుకు చేర్చారు. దీంతో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పినట్లైంది.
దీనిపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో బోటు ఆగిపోయిందన్నారు. గాలుల తీవ్రత ఎక్కువైనప్పుడు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజిన్ స్లో చేస్తామని, అవసరమైతే స్టీమర్ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామని తెలిపారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో టూరిస్ట్ బోటును తిప్పడం లేదని వెల్లడించారు. టూరిస్ట్‌లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.