K.B.C lottery fruad: అమాయకులను బురిడీ కొట్టిస్తున్నసైబర్ నేరగాళ్లు
కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. అమితాబచ్చన్ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌ను మన దేశంతో పాటు పలు దేశాల్లో కూడా ప్రేక్షకులు చూస్తుంటారు. ఈ ప్రోగ్రామ్‌కు ఉన్న క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో పలువురు అమయాకులను బురిడీ కొట్టిస్తున్నారు. కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. ఇటువంటి కేసులు ఇటీవల ఎక్కువ అయ్యాయి.
కౌన్ బనేగా కరోడ్ పతి ల్యాటరీ తగిలిందని, లాటరీ డబ్బులు డిపాజిట్ చేస్తామని కేటుగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అమాయకులను నమ్మిస్తున్నారు. వాళ్ల బ్యాంక్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఫోన్ హ్యాక్ చేసి వాళ్ల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబో అంటున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ నగర వాసులకు సూచిస్తున్నారు. లాటరీ వచ్చిందని వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని సలహా ఇస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నా, సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతునే ఉన్నారు. అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. డబ్బులు కొట్టేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.