సాధారణంగా దొంగల్ని పోలీసులు పట్టుకుంటారు. కానీ.. ఇక్కడ ఓ పోలీసే దొంగలా మారాడు. డ్రగ్స్ (drugs)పట్టివేతలో తన చేతివాటం చూపిన ఎస్సై రాజేందర్‌ని (SI Rajender)పోలీసులు అరెస్ట్ చేశారు.
SI Rajender : సాధారణంగా దొంగల్ని పోలీసులు పట్టుకుంటారు. కానీ.. ఇక్కడ ఓ పోలీసే దొంగలా మారాడు. డ్రగ్స్ (drugs)పట్టివేతలో తన చేతివాటం చూపిన ఎస్సై రాజేందర్‌ని (SI Rajender)పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ సైబర్ క్రైమ్ (Cyberabad Cybercrime)విభాగంలో రాజేందర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఎస్ఐ ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ (Hyderabad)నగరంలోని నార్కోటిక్ (Narcotic)విభాగం అధికారులకు పక్కా సమాచారం అందడంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్, సీపీ సీవీ ఆనంద్‌కు (CP CV Anand)నివేదిక ఇచ్చారు.
అనంతరం నిందితుడు రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులకు(Raydurgam Police) అప్పగించడంతో వారు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన రాయదుర్గం ఎస్ఐగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. అప్పట్లో రాజేందర్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఆ ఉత్తర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన డ్రగ్స్‌ను విక్రయిస్తూ మరోసారి పట్టుబడ్డాడు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న రాజేందర్ ఫిబ్రవరి నెలలో సైబర్ నేరంలో భాగంగా ముంబయి వెళ్లారు. అక్కడ సైబర్ మోసానికి పాల్పడిన నైజీరియన్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్సై రాజేందర్ గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకుని ఇంట్లో దాచాడు. అనంతరం ఆ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు రాజేందర్ ప్రయత్నించాడు. రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందడంతో నార్కోటిక్ విభాగం పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేసి.. రూ.80 లక్షల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.