ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 12వ తేదీన రామగుండంలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి రానున్న ప్రధాని.. ముందుగా బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. అక్కడి నుంచి రామగుండం వెళ్లనున్నారు. రామగుండం వెళ్లే ముందు బేగంపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సి.ఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వమించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, దక్షణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ ఫాక్టరీ CEO ఏ.కె జైన్ లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వేదికల వద్ద తగిన బందోబస్తు, శాంతి భద్రతలు,బందోబస్తు తదితర ఏర్పాట్లను బ్లూబుక్ ప్రకారం చేయాలని ఆదేశించారు.
ఈనెల 12వ తేదీన రామగుండంలో జరిగే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. pic.twitter.com/TWTp2GTeHH
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) November 4, 2022
సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డిజి జితేందర్, హైదరాబాద్ సీపీ సి.వి ఆనంద్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఫైర్ సర్వీసుల ఐజి సంజయ్ జైన్, రామగుండం సీపీ చంద్ర శేఖర్ రెడ్డి, పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు.
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) November 4, 2022